బొల్లారం నీటి సమస్య తీర్చాలని వినతిపత్రం అందజేత

- బొల్లారం మున్సిపల్ నీటి సమస్యపై హైదరాబాద్ మహానగర సరఫరా మేనేజింగ్ డైరెక్టర్ వినతిపత్రం అందచేసిన బీజేపీ నాయకులు


     


 





జిన్నారం, సెప్టెంబర్ 24, (వుదయం ప్రతినిధి ): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీ బీజేపీ  అధ్యక్షుడు వి. భరత్ చారి ఆధ్వర్యంలో  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గిద్దె రాజు చేతుల మీదుగా బొల్లారం మున్సిపాలిటీ నీళ్ల కోసం కోరుతూ హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దాన కిషోర్ కి బిజెపి నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కౌన్సిల్ సభ్యులు గిద్దె రాజు మాట్లాడుతూ బొల్లారం మున్సిపాలిటీకి ప్రభుత్వం 16 లక్షల లీటర్ల నీళ్లను కేటాయించిందని అయితే ప్రస్తుతం 3-4 లక్షల లీటర్ల నీళ్లు మాత్రం ఇస్తున్నారు, అయితే బొల్లారం పంచాయతీ గా వున్నప్పుడు వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చేవాళ్ళు అన్నారు, మున్సిపల్ అయినా తరువాత నెలకు ఒక్కసారి కూడా ఇవ్వడం లేదని  మా మునిసిపాలిటీకి ఇచ్చే నీళ్లు మాకు ఇస్తే చాలు అన్నారు లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు  మున్సిపల్ కార్యాలయం, వాటర్ బోర్డు ఖైరతాబాద్, ఎంఎల్ఏ క్యాంపు ఆఫీసును ముట్టడి కార్యక్రమాలు చేస్తాం అని రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు  గిద్దె రాజు అన్నారు.  ఈ కార్యక్రమంలో 22వ వార్డ్ కౌన్సెలర్ పి. సరిత శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, ధనుంజెయ్, తదితరులు పాల్గొన్నారు.