తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపు కున్న బీ జే పీ


రామకృష్ణాపూర్ సెప్టెంబర్ 17( వుదయం : క్యాథనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ వార్డ్ లల్లో రామకృష్ణ పూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి అరిగెల రవీందర్, రామాలయం చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్, సూపర్ బజార్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుముళ్ల పోచం, జ్యోతినగర్ లో రాజలింగు మోతే, అల్లూరి సీతారామరాజు నగర్ లో ఒరగంటి సాయి, ఆంధ్రబ్యాంక్ ఏరియా లో బంగారు ప్రసాద్, మల్లికార్జున నగర్ వైద్య శ్రీనివాస్, విఠల్ నగర్ లో దండు రాజేందర్, రాజీవ్ చౌక్ లో వేముల అశోక్, శ్రీనివాస నగర్ ముద్దసాని శ్రీనివాస్, కుర్మపల్లి అందుగుల రవీందర్, అమరావది గద్దల సతీష్, తిలక్ నగర్ గొడిసెల తిరుపతి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ .. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి నుండి, తెలంగాణ విముక్తి కోసం నిజాం రాజు నిరంకుశ పాలనకు, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులే మహా యోధులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన వీరుల చరిత్ర ప్రపంచ పుటలలో చేరగని స్థానం పొందినదని కొనియాడారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను, కాంక్షను తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు పాలరాజయ్య, కోల శ్రీనివాస్- రాం కిషోర్, రాజు, శివ, దొంత మల్ల శ్యామ్, ధన్సింగ్, కళాధర్ రెడ్డి, నిమ్మల నరేష్, మధు, సతీష్నరేష్. మదు. సరీష్శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.