సంగారెడ్డి సెప్టెంబర్ 17 వుదయం ప్రతినిధి): ఎగువన . కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.99 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.520 టీఎంనీ ల నీరు చేరింది. ప్రాజెక్ట్ లోకి 45,282 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. వరా.కాలం ముందు(ఆగస్టు) వరకు కేవలం అర టీఎంనీ లెవల్ కి వాటర్ పడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో దాదాపు 5 టీఎంసీల నీరు గురువా చేరింది. తాగునీటి సరఫరాకే ఇబ్బందులు ఏర్పడుతున్న సమయంలో ఇన్ ఫ్లో రావడం స్థానికంగా ఊరట నిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు జలకల సంతరించుకోగా సింగూరుకు ఇప్పుడు ఇన్ ఫ్లో పెరుగుతున్నది. ఇన్ ఫ్లో కొనసాగుతున్ననేపథ్యంలో నీటి మట్టం మరింత పెరగనున్నదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
సింగూరు ప్రాజెక్టుకు పెరుగుతున్న నీటి మట్టం