బాచుపల్లి, సెప్టెంబర్ 17,(వుదయం ప్రతినిధి ),నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, కమీషనర్ కు కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి కృషి చేయాలని 21వ డివిజన్ కార్పొరేటర్ కాసాని శిరీష వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 21వ డివిజన్ లో సీ సీ రోడ్స్, ఎలక్ట్రికల్ వర్క్, కాలువలు, గ్రంధాలయం, యోగ భవనము, మార్కెట్ యార్డ్, పార్క్ ఓపెన్ జిమ్, స్కూల్ బిల్డింగ్, టాయిలెట్స్, వాటర్ ట్యాంక్స్, మొదలగునవి మౌలిక సదుపాయాలు కల్పించాలని మేయర్, కమీషనర్ తో చర్చించడం జరిగిందని తెలిపారు. అందుకు మేయర్, కమీషనర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి, త్వరలో డివిజన్ లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
మౌలిక సదుపాయాలు కల్పించండి : కార్పొరేటర్ కాసాని శిరీష