నాగార్జున సాగర్ 12 గేట్ల ఎత్తివేత


నల్గొండ సెప్టెంబర్ 17 (వుదయం ప్రతినిధి): నాగార్జునసాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 45,651 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సాగర్ 12గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు నెలల్లో మూడోసారి నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 2,45,651 క్కూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 217,984 క్యూసెకులుగా ఉంది. పూరి స్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 310.2522 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరుకుంది.